ప్రవీణ్‌కు జాతీయస్థాయి అవార్డు ప్రదానం
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:43 PM
రైజ్ సంస్థల అధినేత డా. పుల్లట ప్రవీణ్ నివమ్ వెల్‌నెస్ సంస్థకు చెందిన ఇండియాస్ లీడింగ్ ఆయుర్వేద అండ్ వెల్నెస్ బ్రాండ్ అవార్డుకు ఎంపిక య్యారు.
కవిటి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రైజ్ సంస్థల అధినేత డా. పుల్లట ప్రవీణ్ నివమ్ వెల్‌నెస్ సంస్థకు చెందిన ఇండియాస్ లీడింగ్ ఆయుర్వేద అండ్ వెల్నెస్ బ్రాండ్ అవార్డుకు ఎంపిక య్యారు. ఈ మేరకు మంగళవారం అహ్మ దాబాద్‌లోని హాయా త్ రీజెన్సీలో నిర్వహించిన ‘బిజినెస్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్-2026’ కార్యక్రమంలో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హార్ష్‌సంగ్వి ఆయనకు అవా ర్డు అందించారు. బైరిపురం గ్రామానికి చెందిన ప్రవీణ్ రైజ్ వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తమ సంస్థ అభివృద్ధికి సహకరి స్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ్‌కు అవార్డు రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు.