డిసెంబరు 12న జాతీయ లోక్ అదాలత్
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:39 PM
జాతీయ లోక్‌అదాలత్ జిల్లలో డిసెంబరు 12న నిర్వహించనున్నట్లు 2వ అదనపు జిల్లా న్యాయా ధికారి సాదుబాబు తెలిపారు. ఈ మేరకు బుధ వారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీ సు, ఇతర శాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఎక్కువ కేసుల రాజీకి చర్యలు
2వ అదనపు జిల్లా న్యాయాధికారి సాదుబాబు
శ్రీకాకుళం లీగల్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్‌అదాలత్ జిల్లలో డిసెంబరు 12న నిర్వహించనున్నట్లు 2వ అదనపు జిల్లా న్యాయా ధికారి సాదుబాబు తెలిపారు. ఈ మేరకు బుధ వారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీ సు, ఇతర శాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అన్ని కోర్టుల్లో పెండిం గ్‌లో ఉన్న కాంపౌండబుల్ క్రిమినల్, ఎక్సైజ్, చెక్‌బౌన్స్ కేసులు. మోటార్ యాక్సిడెంట్ క్లైమ్‌ల వివాదాలు, కుటుంబ తగాదాలు, భూవివాదాలు, కార్మిక కేసులతో పాటు ఇతర కేసులను ఎక్కువ సంఖ్యలో రాజీ ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. లోక్‌అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులకు కోర్టు ఫీజు కూడా కక్షిదారులకు తిరిగి వస్తుందన్నారు. ఇందులో రాజీ అయ్యే కేసులు కోర్టు డిక్రీతో సమానమన్నారు. కేసుల్లో ఉన్న బాధితులకు ముందస్తు నోటీసులు ఇచ్చి లోక్ అదాలత్‌కు హాజరయ్యేలా అవగాహన కలిగించా లన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు నేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో 3వ అదనపు జిల్లా న్యాయాధికారి వివేకానందశ్రీనివాస్, పోక్సో కోర్టు న్యాయాధికారి ఎం.సునీత, జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి కె.అనురాగ్, 1వ అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి జమృత బేగం కమాలుద్దీన్, ఏఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఎక్సెజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.