ఆర్టీవో గంగాధర్‌కు జాతీయ అవార్డు
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:54 AM
బెస్ట్ రోడ్ సేప్టీ అవేర్‌నెస్, పబ్లిక్ అవుట్‌రిచ్ అవార్డుకు ఆర్టీవో పీవీ గంగాధర్‌రావు ఎంపిక య్యారు. ఈ మేరకు ఈనెల 10న బెంగళూరు లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్ర మంలో కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి ఈ అవార్డును అందజేశారు.
కర్ణాటక మంత్రి చేతులమీదుగా ప్రదానం
అభినందించిన అధికారులు, సిబ్బంది
పాత శ్రీకాకుళం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): బెస్ట్ రోడ్ సేప్టీ అవేర్‌నెస్, పబ్లిక్ అవుట్‌రిచ్ అవార్డుకు ఆర్టీవో పీవీ గంగాధర్‌రావు ఎంపిక య్యారు. ఈ మేరకు ఈనెల 10న బెంగళూరు లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్ర మంలో కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి ఈ అవార్డును అందజేశారు. ఈ నేపథ్యంలో బుధ వారం స్థానిక జిల్లా రవాణా కార్యాలయంలో ఆయనను డిప్యూ టీ రవాణా కమిషనర్ విజయసారధి అభినం దించారు. జిల్లా అధికారి జాతీయ స్థాయిలో గుర్తిం పు పొందడం గర్వకార ణమన్నారు. జిల్లాలో రహదారి భద్రతా చర్య లు, ప్రజల్లో అవగాహన కల్పించడం లో గంగాధర్ రావు విశేష కృషి చేశారన్నారు. ఇదిలా ఉండగా గంగాధర్‌రావుకు జాతీయ స్థాయి అవార్డు రావడంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం వ్యక్తంచేసి అభినం దించారు.