జాతీయస్థాయి బాక్సింగ్‌లో నైషా సత్తా
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:02 AM
జాతీయస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాకుళానికి చెందిన చిన్నారి నైషా సత్తా చాటింది.
శ్రీకాకుళం స్పోర్ట్స్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాకుళానికి చెందిన చిన్నారి నైషా సత్తా చాటింది. హర్యానాలోని అక్టోబరు 15 నుంచి 19వ తేదీ వరకు జరిగిన అండర్-14 బాలికల విభాగంలో నైషా పాల్గొని జాతీయస్థాయిలో స్వర్ణపతకాన్ని సాధించింది. నైషా ప్రాథమిక విద్యాభ్యాసం శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయంలో చదివి క్రీడలపై ఉన్న ఆసక్తితో ఉన్నత చదువులకోసం చెన్నై వెళ్లి అక్కడే చదువుతూ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. గత మూడేళ్ల నుంచి జిల్లా, రాష్ట్ర, జోనల్‌స్థాయిల్లో పతకాలను సాధించింది. గత ఏడాది జాతీయ స్థాయిలో రజిత పతకాన్ని సాధించిన ఈమె ఈ పర్యాయం స్వర్ణ పతకాన్ని సాధించడంపై పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.