Share News

నాగేష్‌ మృతిపై సీబీఐతో విచారణ చేపట్టాలి

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:35 AM

వజ్రపుకొత్తూరు మండలం నువ్వ లరేవు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్ధి మువ్వల నాగేష్‌ అను మానాస్పద మృతిపై సీబీఐతో విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధి త కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

నాగేష్‌ మృతిపై సీబీఐతో విచారణ చేపట్టాలి
పోలీసు వాహనాన్ని అడ్డుకుంటున్న నువ్వలరేవు గ్రామస్థులు

  • కుటుంబ సభ్యుల డిమాండ్‌

  • గాంధీ విగ్రహం ఎదుట ధర్నా

పలాస, జనవరి 24(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం నువ్వ లరేవు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్ధి మువ్వల నాగేష్‌ అను మానాస్పద మృతిపై సీబీఐతో విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధి త కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివా రం మధ్యాహ్నం స్థానిక రాజీవ్‌ మున్సిపల్‌ బస్టాండ్‌ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. రోడ్డుపై భైఠాయించి నిరసన తెలపడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్ప డింది. వారి వివరాల మేరకు.. మువ్వల నాగేష్‌(18) ఎచ్చెర్ల సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుకుంటూ 2021, జనవరి 27న పూర్తిగా కాలిపోయి శవంగా కనిపించాడు. దీనిపై నువ్వలరేవు గ్రామస్థులు మూకుమ్మడిగా ఆ కళాశాల వద్ద ఆందోళన చేయడంతో పాటు ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఈ వ్య వహారంలో అప్పటి మం త్రిగా ఉన్న సీదిరి అప్పల రాజు హామీ మేరకు ఆందోళన విరమించారు. అయితే ఆ విద్యార్థి కు టుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు. దీం తో అప్పటి నుంచి నాగేష్‌ కుటుంబ సభ్యులు, నువ్వలరేవు గ్రామస్థులు ఆందోళన చేస్తూనే ఉ న్నారు. ఈ నేపథ్యంలో శనివారం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీసులు వచ్చి మంతనాలు జరిపినా ఫలితం లేకపోయింది. వీరికి మద్దతుగా ధర్నా చేసిన పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్‌ను పోలీసుస్టేషన్‌కు తరలిస్తుండగా.. వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆందోళన విరమించారు.

Updated Date - Jan 25 , 2026 | 12:35 AM