జీజీహెచ్ ల్యాబ్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:59 PM
హెచ్‌ఐవీ పరీక్షల్లో నాణ్యమైన ప్రమా ణాలు పాటించి నందుకు ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి (రిమ్స్)లోని హెచ్‌ఐవీ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబరేటరీకి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) గుర్తింపు లభించిందని ఆసుపత్రి సూపరింటెం డెంట్ డా.జి. సౌమిని తెలిపారు.
రిమ్స్ సూపరింటెండెంట్ డా. సౌమిని
అరసవల్లి, జూలై 27(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ పరీక్షల్లో నాణ్యమైన ప్రమా ణాలు పాటించి నందుకు ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి (రిమ్స్)లోని హెచ్‌ఐవీ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబరేటరీకి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) గుర్తింపు లభించిందని ఆసుపత్రి సూపరింటెం డెంట్ డా.జి. సౌమిని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె మాట్లాడుతూ.. రోగు లకు మరింత మెరుగైన వైద్యసేవలను అందిం చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ సంద ర్భంగా మైక్రో బయాలజీ విభాగాధిపతి డా.ఎన్.లక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫె సర్లు డా.బీఎస్‌ఎస్ విజయ శ్రీ, డా.బి.రాధిక, టీఓ ఎం. స్వప్న, ల్యాబ్ టెక్నీషియన్లు, కౌన్సిలర్లకు అక్రిడి టేషన్ ధ్రువపత్రం అందించి అభినందించారు. కార్యక్రమంలో ప్రయోగశాల సిబ్బంది, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.