Share News

రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:47 PM

మార్కెట్‌కమిటీ కార్యవర్గం రైతులకు ప్రయోజనాలు అందించడంకోసం పని చేయాలని పీయూసీ చైర్మన్‌,ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కోరారు.

 రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి
పొందూరు: మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌:

పొందూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యో తి): మార్కెట్‌కమిటీ కార్యవర్గం రైతులకు ప్రయోజనాలు అందించడంకోసం పని చేయాలని పీయూసీ చైర్మన్‌,ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కోరారు. పొందూరు మార్కెట్‌ కమిటీ ఆవరణలో గురువారం కమిటీ అధ్యక్షురాలిగా చిగిలిపల్లి పద్మావతి, ఉపా ధ్యక్షురాలిగా కొంచాడ లక్ష్మి, డైరెక్టర్లగా వి. చక్రధరరావు, కె.వెంకటరావు, పి.రామలక్ష్మి, కె.ఉమ, పి.విజయశాంతి, ఎం.ఇస్మాయిల్‌. వెంకటలక్ష్మి, ఎ.సుశీల, ఎల్‌.సింహాచలం, యర్రా కిరణ్‌కుమార్‌, డి.రాధాకృష్ణ, పి.రవి, ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు సీహెచ్‌ రామ్మో హన్‌, ఏఎంసీ మాజీ అధ్యక్షులు అన్నెపు రాము, పార్టీ జిల్లా కార్యదర్శి సీపాన శ్రీరంగనాయకులు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చినరంగ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు వి.మురళి, తెలుగు యువత జిల్లా ప్రధానకార్యదర్శి బలగ శంకర్‌, పార్టీ మండల ఉపాధ్యక్షు డు గిరి, ఎంపీటీసీలు అన్నెపుకుమారి, ఎ. వాణి, బాడాన హారిక, ఎ. విజయలక్ష్మి, లో లుగు వెంకట్‌, వరదరాజులు, కె.శ్రీనివా సరావు, డి. రవికుమార్‌ పాల్గొన్నారు.

వలంటీర్లకు పుస్తకాల పంపిణీ

పొందూరులో మండల అక్షరాంధ్ర వలంటీర్లకు పుస్తకాలను పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ పంపిణీచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వాసుదేవరావు, ఏపీఎంలు శ్యామలరావు, రమణమూర్తి ఏపీవో శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్‌, ఉపాధ్యక్షుడు బాడాన గిరి పాల్గొన్నారు.

ఫబూర్జ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పాలవలస పంచాయతీ సీఎస్‌పీ రోడ్డు నుంచి కొత్తవలసకు నిర్మించిన తారు రోడ్డు ్డను ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రారంభించా రు. కార్యక్రమంలో ఏపీ మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణనాయుడు, మాజీ ఎమ్మెల్సీ విశ్వ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఫసరుబుజ్జిలి, సెప్టెంబరు 17 (ఆంధ్ర జ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు సారధ్యంలో 2047 వికసిత్‌ భారత్‌ సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. మండలంలోని వెన్నెలవలస నుంచి బూర్జ మండలంలోని బొడ్లపాడు గ్రామా నికి నిర్మాణం పూర్తి చేసుకున్న బీటీ రహదారిని ప్రారంభించారు.

Updated Date - Sep 17 , 2026 | 11:47 PM