Share News

‘విద్యాభివృద్ధికి కృషి చేయాలి’

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:10 AM

విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి సూచించారు.

‘విద్యాభివృద్ధికి కృషి చేయాలి’
విద్యార్థులతో మాట్లాడుతున్న సమన్వయాధికారి యశోదలక్ష్మి

బూర్జ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి సూచించారు. కొల్లివలసలో ఉన్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశా లను గురువారం తనిఖీ చేశారు. కిచెన్‌ గార్డెన్‌ను పరిశీలించారు. ఎస్‌ఏ-1 పరీక్షల నిర్వహణను పరిశీలించి విద్యా ర్థులతో మాట్లాడారు. పరీక్షల సన్నద్ధత, ఆరోగ్యం, పరిశుభ్రతపై ఆరా తీశారు. జవాబు పత్రాలను సకాలంలో దిద్ది విద్యార్థుల అభ్యసన పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాంబా బు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 12:10 AM