రైతు సంక్షేమానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే రవికుమార్
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:26 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస ఏఎంసీ కార్యాలయంలో శని వారం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో వ్యవ సాయ మార్కెట్ కమిటీ నిధులు మళ్లించడంతో ఏఎంసీలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రైతులు పండించే పంటలను మార్కెట్ కమిటీల ద్వారా విక్రయించి వారికి మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్రలో మా ర్కెట్ కమిటీలు ఉన్నప్పటికీ రైతులు ఈ విధా నాన్ని వినియోగించడం లేదని, దీనితో కమిటీలు ఆర్థికంగా బలోపేతం కాలేపోతున్నా యన్నారు. నూతన చైర్మన్ పేరాడ రామ్మోహనరావు మా ట్లాడుతూ.. పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరు కట్ల విశ్వప్రసాద్, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, పీఏసీఎస్ చైర్మన్ మాధవి, బీజేపీ సమన్వయకర్త పేడాడ సూరపు నాయుడు, కూటమి నాయకులు చింతాడ అప్పా రావు, పి.గడ్డెయ్య, జి.వెంకటరావు, ఎండ రామా రావు, మురళీధర్, సునీత, రాజ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సాగర్ పాల్గొన్నారు.
ఎత్తిపోతల పథకం ప్రారంభం
బూర్జ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):ఉవ్వపేట వద్ద నీలాదేవిపురం ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం ప్రారంభించారు. పూర్తిస్థాయిలో సాగునీరందిం చేందుకు చర్యలు చేపడుతున్నా మన్నారు. నీలా దేవిపురంలో ఇంటింటి టీడీపీ కార్యక్రమంలో పా ల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరు కట్ల విశ్వప్రసాద్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ రామ కృష్ణంనాయుడు, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్య నారాయణ, సీతబాబు, ప్రభాకరరావు, జగ న్నాథంనాయుడు తదితరులు పాల్గొన్నారు.