Share News

‘అక్వాన్‌’పై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:33 AM

అక్వాన్‌ తుఫాన్‌పై ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండర్కర్‌ కోరారు. గురువారం కవిటి తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.

‘అక్వాన్‌’పై అప్రమత్తంగా ఉండాలి
కవిటి: కళింగపట్నం వద్ద అధికారులతో మాట్లాడుతున్న స్వప్నిల్‌ దినకర్‌ పుండర్కర్‌:

కవిటి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అక్వాన్‌ తుఫాన్‌పై ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండర్కర్‌ కోరారు. గురువారం కవిటి తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం తీరప్రాంత గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో ఉండి తీరప్రాంత గ్రామాల్లో ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. తుపాన్‌ తీరం దాటే సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకే పరిమితంకావాలని తెలిపారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా ప్రజలను తీసుకురావాలని కోరారు. పెద్దకర్రివానిపాలెం, కళింగపట్నం గ్రామాల్లో అక్కడి పరిస్థితులను పరిశీలించి మత్స్యకారులుతో మాట్లాడారు. గ్రామ స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ కళ్యాణచక్రవర్తి, డిప్యూటీ ఎంపీడీవో బీవీఎస్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు19 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం గ్రామీణ, గార మండలాల్లోని పెద, చినగణగళ్లవానిపేట, పుక్కళ్లపేట, మోఫస్‌ బందరు, ఇప్పిలి, బలరాంపురం, కొమరవానిపేట, మొగదారుపాడు తది తర తీరప్రాంతాల్లోని మత్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని రెడ్‌క్రాస్‌ శ్రీకాకుళం సిబ్బంది మత్యకారులకు గురువారం హెచ్చరికలు జారీచేశారు. తుఫాన్‌ ప్రభావంపైౖ మత్యకార గ్రామాల్లో ముందస్తు హెచ్చరికలపై లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలను అప్రమత్తంచేశారు. తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, ఈ సమయంలో చేపల వేటను నిషేధించారని ప్రజలకు వివరించారు. దీనిని దృష్టిలోఉంచుకొని తుఫాన్‌ ప్రభావం తగ్గినంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సిబ్బంది సత్యనారాయణ, ఉమాశంకర్‌, జగదీష్‌, చిన్నికృష్ణ, మనుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:33 AM