Share News

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:52 PM

స్థానికసంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఆదివారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గం సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి అధ్యక్షతన నియోజకవర్గం కార్యకర్తలు, బూత్‌కన్వీనర్లు, ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు.

 స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

పలాస, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. ఆదివారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గం సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి అధ్యక్షతన నియోజకవర్గం కార్యకర్తలు, బూత్‌కన్వీనర్లు, ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఇప్పటి నుంచి కార్యకర్తలు, నాయకులు సమన్వయంగా పనిచేసి వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో మొత్తం అన్నీ వార్డులు, పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు గెలుపొందే విధంగా ప్రచారం ప్రారంభించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్‌ టు డోర్‌ ప్రచారం చేయాలని కోరారు. అనంతరం నేతల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. సమావేశంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, సూర్యనారాయణస్వామి ఆలయబోర్డు సభ్యుడు కొర్ల కన్నారావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, గాలి కృష్ణారావు, మల్లా శ్రీనివాస్‌, గురిటి సూర్యనారాయణ, రామకృష్ణ. కొత్తసత్యం, దడియాల నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:52 PM