Share News

సాంకేతికతపై పట్టు సాధించాలి

ABN , Publish Date - May 25 , 2026 | 11:48 PM

విధి నిర్వహణలో క్రమశిక్షణ, చట్టాలపై అవగాహన, సాంకేతికతపై పట్టు సాధిం చాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు.

సాంకేతికతపై పట్టు సాధించాలి
శిక్షణ పొందుతున్న సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

పోలీస్‌ శిక్షణా కేంద్రం సందర్శన

శ్రీకాకుళం క్రైం, మే 25 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో క్రమశిక్షణ, చట్టాలపై అవగాహన, సాంకేతికతపై పట్టు సాధిం చాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న కాని స్టేబుళ్లతో మాట్లాడుతూ.. విధుల్లో భాగం గా ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహ రించాలన్నారు. అవుట్‌డోర్‌లో పరేడ్‌, డ్రిల్‌, శారీరక దారుఢ్య శిక్షణ, ఆయుధాల వినియోగం తదితర అంశాలు పరిశీలించి వాటిని వివరించారు. అనంతరం శిక్షణా కేంద్రంలో కల్పిస్తున్న మౌలిక వసతులు, పరిశుభ్రత, కంప్యూ టర్‌ ల్యాబ్‌, తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో శిక్షణా కేంద్రం డీఎస్పీ గోవిందరావు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యం’

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేది కను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 70 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు ఆదేశించారు.

Updated Date - May 25 , 2026 | 11:48 PM