Share News

‘క్వాంటమ్‌ సాంకేతికతతో గ్లోబల్‌ లీడర్లుగా ఎదగాలి’

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:26 AM

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి అత్యా ధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యం పెం పొందించుకుని అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆర్జీ యూకేటీ రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ సండ్ర అమరేంద్ర కుమార్‌ అన్నారు.

‘క్వాంటమ్‌ సాంకేతికతతో గ్లోబల్‌ లీడర్లుగా ఎదగాలి’
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రిజిస్ట్రార్‌ అమరేంద్రకుమార్‌

ఎచ్చెర్ల, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి అత్యా ధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యం పెం పొందించుకుని అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆర్జీ యూకేటీ రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ సండ్ర అమరేంద్ర కుమార్‌ అన్నారు. ఎస్‌ఎం పురం ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో ‘గ్లోబ ల్‌ క్విస్కిట్‌ పాల్‌ ఫెస్ట్‌-2026’ను శుక్ర వారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంపస్‌లో ఐబీఎం క్వాంటమ్‌ మద్దతుతో వరుసగా రెండోసారి ఫెస్ట్‌ నిర్వహించడం అభినందనీ యన్నారు. నవంబరు 2 వరకు జరిగే ఈ ఫెస్ట్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరిశోధన, ఆవిష్కరణలో ప్రతిభను చాటు కోవాలన్నారు. క్వాంటమ్‌ సాంకేతికపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, క్విస్కిట్‌ నైపుణ్యాలను మెరుగుపర్చడం ఈ ఫెస్ట్‌ ప్రధా న ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం.గిరిధర్‌, క్యాంపస్‌ పరిపాలనాధికారి ఎం.శివరామకృష్ణ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ వాసు, అకడమిక్‌ డీన్‌ శివరామశాస్త్రి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:26 AM