Share News

డీజేలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:37 PM

పలు చోట్ల వినోదం కోసం ఏర్పాటు చేస్తున్న డీజేల వల్ల యువత ప్రాణాలు కోల్పోతుండడంతో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.

  డీజేలపై అప్రమత్తంగా ఉండాలి
టీడీపీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు:

కోటబొమ్మాళి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పలు చోట్ల వినోదం కోసం ఏర్పాటు చేస్తున్న డీజేల వల్ల యువత ప్రాణాలు కోల్పోతుండడంతో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.ఆదివారం నిమ్మాడలో గ్రామస్థులతో వినాయక నవరాత్రులపై చర్చించారు. అనంతరం గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో కుటుంబసభ్యులతో పాల్గొన్నారు. అలాగే క్యాంపుకార్యాలయంలో సంతబొమ్మాళి మండలంలోని జగన్నాథపురం పంచా యతీకి చెందిన 28 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఈమేరకు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్నాఽథపురం మాజీ సర్పంచ్‌ పుక్కళ్ల శ్రీని వాసరావు, మండల ఉపాఽధ్యక్షుడు మెండ అప్పారావు ఆధ్వర్యంలో అర్జాల బాలరాజు, అర్జాల అప్పలస్వామి, శివ, కోడ గురుమూర్తి, ధనరాజు, అడ్ల దాలయ్య, చోడిపల్లి ముస లయ్య, ధర్మారావు, పి.రామ్మూర్తి, గురమ్మ, పుక్కళ్ల పొలమ్మ, అప్పలస్వామి, భగవాన్‌ దాస్‌ తదితరులు టీడీపీలో చేరారు. కాగా క్యాంపు కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆదివారం ప్రజాదర్భార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులు స్వీకరించారు. కాగా కోటబొమ్మాళి మండలంలోని కన్నేవలస పంచాయతీలోని చుట్టుగుండం, సంతబొమ్మాళ మండలం లోని నర్సాపురం, పెద్దతుంగం, వడ్డితాండ్ర ప్రాంతాలకు చెందిన ఇన్‌లాండ్‌ మార్కెటింగ్‌ మత్య్సకార సొసైటీల సభ్యులు మంత్రిని కలిశారు. అలాగే అక్టోబరు 13 నుంచి 15వ వరకు జరగనున్న కొత్తమ్మతల్లి ఉత్సవాలపై త్వరలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. నిమ్మాడ క్యాంపు కార్యా లయంలో కొత్తమ్మతల్లి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు మంత్రిని కలిశారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, జిల్లా రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయిన రమేష్‌, టీడీపీ నేతలు కోరాడ గోవిందరావు, మజ్జి కృష్ణరావు, దేవాది సింహాద్రమ్మ, సంతబొమ్మాళి మండల టీడీపీ అధ్యక్షుడు సగ్గు శాంతిస్వరూప్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రామచంద్రరరావు, కింజరాపు విజయ మాధవి, కె.అచ్చెన్నాయుడు, కింజరాపు సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 11:37 PM