Share News

చిరువ్యాపారి హత్య

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:26 AM

శ్రీకాకుళం కలెక్టరేట్‌ సమీపంలోని వాంబే కాల నీకి చెందిన చిరు వ్యాపారి పైల మోహన్‌(40).. ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచా యతీ వెంకన్నగారి పేట సమీపంలో గురువారం హ త్యకు గురయ్యాడు.

చిరువ్యాపారి హత్య
పైల మోహన్‌ మృతదేహం

  • వెంకన్నగారిపేట సమీపంలో ఘటన

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం కలెక్టరేట్‌ సమీపంలోని వాంబే కాల నీకి చెందిన చిరు వ్యాపారి పైల మోహన్‌(40).. ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచా యతీ వెంకన్నగారి పేట సమీపంలో గురువారం హ త్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థా నికంగా కలకలం రేపింది. ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. వాంబే కాలనీలో నివాసం ఉంటున్న మోహన్‌ కిరాణాతోపాటు టిఫిన్‌ షాపు నిర్వహిస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజ నం చేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత మోహన్‌ వెంకన్న గారిపేట వద్ద శవమై కనిపించాడు. తలకు తీవ్రంగా గాయ పర్చి హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానికుల సమాచా రం మేరకు జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ జి.లక్ష్మణరావు ఘటనా స్థలా నికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హతుడి వివరాలు తెలుసు కుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య శారద, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలంలో బీరు సీసాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తలకు తీవ్ర గాయాలుండడంతో హత్యగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేశారా?, లేదా ఇక్కడే చంపేశారా? అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Feb 27 , 2026 | 12:26 AM