ప్రశాంతంగా మునిసిపల్ ఎన్నికల పోలింగ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:04 AM
ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రి య ప్రశాంతంగా, సాఫీగా సాగిందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు.
జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
ఇచ్ఛాపురం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రి య ప్రశాంతంగా, సాఫీగా సాగిందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. ఆది వారం పోలింగ్ పూర్తయిన తరువాత విలేకరు లతో మాట్లాడుతూ.. భోజన విరామం అనంత రం ఓటర్లు అధిక సంఖ్యలో కేంద్రాలకు వచ్చా రని, క్యూలైన్‌లో రద్దీ పెరిగినప్పటికీ సిబ్బంది ఓటింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశా రన్నారు. వయోవృద్ధులకు ఇబ్బంది కలగకుండా, క్యూలైన్ల్‌తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేసే వెసులుబాటు కల్పించామన్నారు. రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లతో కూడా మాట్లా డామని, ఎన్నికల నియమావళికి లోబడి పారద ర్శకంగా విధులు నిర్వహించడంతో ఎక్కడా ఎలాంటి సమస్యలు, అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎంతగానో సహక రించాయని చెప్పారు. బ్యాలెట్ బాక్సులను అత్యంత భద్రత నడుమ స్ర్టాంగ్ రూమ్‌లో భద్రపరచనున్నట్టు తెలిపారు. నిరంతర నిఘాతో పాటు మూడు షిఫ్టుల్లో అధికారులు పనిచేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల నిర్వహణను విజయవంతంగా పూర్తిచేసిన అధికారులు, సిబ్బంది, పోలీస్‌లకు అభినందనలు తెలిపారు.
తల్లి ఓటు విషయంలో జేసీతో వాగ్వాదం
ఇచ్ఛాపురం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల్లో చిన్న ఘటన చోటుచేసుకుంది. ఆదివారం 11వ వార్డులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు విషయంలో జేసీతో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. వృద్ధురాలిని తీసు కొని ఆమె కుమారుడు ఓటు వేయించేందుకు వచ్చాడు. అదే సమయంలో కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ వచ్చారు. సదరు వ్యక్తి బ్యాలెట్ పేపర్‌పై తల్లి చెప్పిన గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధపడ్డాడు. దీనిపై జేసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి ఓటు వారే వేయాల్సి ఉంటుందన్నారు. తన తల్లి వయసు 85 సంవత్స రాలని, కంటిచూపు సరిగా లేదని అందుకే ఆమె తరుపున తానే ఓటు వేస్తానని పట్టుబట్టాడు. అయితే అందుకు వీలు కాదని జేసీ తేల్చి చెప్పారు. దీంతో కొద్దిసేపు జేసీతో వాగ్వాదం చేసిన సదరు వ్యక్తి ఓటు వేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జేసీ వారిస్తున్నా అక్కడి నుంచి వెళ్లిపోవడం విశేషం.