ముగిసిన బహుభాషా నాటిక పోటీలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:53 PM
శ్రీసుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళా మంది ర్‌లో జరుగుతున్న బహుభాషా నాటిక పోటీలు ఆదివారం ముగి శాయి.
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీసుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళా మంది ర్‌లో జరుగుతున్న బహుభాషా నాటిక పోటీలు ఆదివారం ముగి శాయి. ఈ సందర్భంగా ‘ద్వారబందాల చంద్రయ్య నాయుడు చరిత్ర విస్మరించిన స్వాతం త్య్ర వీరుడు’ నాటిక ఆద్యంతం ఆకట్టు కుంది. అల్లూరి సీతారామరాజుకి ముందు బురదకోట కేంద్రంగా శ్రీకా కుళం నుంచి నైజాం వరకు రాజ్యాలను ఆక్రమిం చుకొని బ్రిటిష్ వారితో పోరాడిన వీరుడిగా ద్వారబందాల చంద్రయ్య నాయుడు చరిత్రకెక్కా రు. జమిందారీ వ్యవస్థ లకు వ్యతిరేకంగా పోరాడి, బ్రిటిష్ కుయుక్తులకు చిన్నవయసులోని నింగి కెగిసిన చంద్రయ్య నాయుడు పాత్రలో ఆర్‌వీ ఎల్‌నరసింహారావు జీవించారు. ఈ నాటికకు పీవీ సత్యనారాయణ రచించగా పి.కృష్ణహితేష్ దర్శకత్వం వహించారు. అలాగే పంజాబీ భాషలో సాగిన నాటిక రక్తికట్టించింది. 1919లో జలియన్‌వాలాబాగ్ మారణకాండ, బ్రిటిష్ పాలకుల నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే సంకల్పంతో చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి విప్లవోద్యమంలో పాల్గొని విప్లవ సంస్థలను నిర్మించిన గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్ పాత్రను సువినయ్ వాట్స్ పోషించి ఆహూ తుల ప్రశంసలు అందుకున్నారు.