Share News

భక్తిశ్రద్ధలతో మొహర్రం

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:32 PM

మొహర్రం పర్వదినాన్ని నగరం లోని పలు దర్గాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మొహర్రం
నమాజ్‌ చేస్తున్న ముస్లిం పెద్దలు

శ్రీకాకుళం కల్చరల్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మొహర్రం పర్వదినాన్ని నగరం లోని పలు దర్గాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చౌక్‌ బజార్‌లో ఉన్న హజరత్‌ సయ్యద్‌ రోషన్‌ షావళి దర్గా, జెండాల వీధి లోని దర్గాల్లో ప్రత్యేక నమా జ్‌ చేశారు. పవిత్ర ఖురాన్‌లోని ఆల్‌బఖర ప్రకారం ఏడాదిలోని నాలుగు నెలలు పవిత్రమైనవని, వీటిలో మోహర్రం ఒకట ని, ఈనెలలో పదో రోజు అషురాను అత్యంత పవిత్రదినంగా పరిగణిస్తారని దర్గా ప్రతినిధులు తెలిపారు. రంజాన్‌ ఉపవాసాల తరువాత అషురా నాటి ఉపవాసా లకు కూడా అంతటి ప్రాధాన్యత ఉందన్నారు. పానకం తయారు చేసి పంపిణీ చేశారు. త్యాగ ధనులను స్మరించుకున్నారు.

ఇచ్ఛాపురంలో..

ఇచ్ఛాపురం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ముస్లింల ప్రధాన పర్వదినాల్లో ఒకటైన మొహర్రంను శుక్రవారం నిర్వహించారు. కస్పా వీధిలోని మసీ దులో ప్రత్యేక నమాజ్‌ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్ద జోహార్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ధర్మయుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి గలిగిన రూపాలను తయారుచేసి వాటిని అలంక రించి ఊరేగించి పూజించే ప్రక్రియనే పీర్లు అంటారని, ఈరోజున పీర్లకు పూజలు చేస్తారన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:32 PM