ముగిసిన రణస్థలం ఎంపీపీ పంచాయితీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:05 AM
రణస్థలం ఎంపీపీ పీఠంపై ఉన్న సందిగ్థత ఎట్టకేలకు తొలగింది.
చెరో రెండేన్నరేళ్లు సర్దుబాటుకు అంగీకారం
నేడు లాటరీ ద్వారా అధ్యక్షుడి ఎంపిక
మంత్రి, ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సమక్షంలో ఒప్పందం
విజయనగరం/శ్రీకాకుళం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రణస్థలం ఎంపీపీ పీఠంపై ఉన్న సందిగ్థత ఎట్టకేలకు తొలగింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు వాస్తవ పరిస్థితిని ఫోన్‌లో వివరించారు. అనంతరం ఆయన సూచనల మేరకు టీడీపీ నుంచి ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ పదవిని ఆశిస్తున్న పిసిని జగన్నాథం, లెంక ప్రభాకరరావులకు చెరో రెండున్నరేళ్లు ఎంపీపీలుగా పనిచేసేందుకు ఇరువురితో ఒప్పందం కుదిర్చారు. ఎవరు ముందు పీఠం అధిరోహించాలన్న విషయమై గురువారం లాటరీ తీయను న్నారు. దీనికి మంత్రి, ఎంపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నజీర్, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున సమక్షంలో అంగీకారం కుదిరింది.