ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:20 AM
జడ్పీటీసీ, ఎంపీపీ (మండల ప్రజా పరిషత్) అధ్యక్ష పదవుల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది.
- గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసిన కలెక్టర్
- జిల్లాలో 30 స్థానాలకు కేటాయింపులు
శ్రీకాకుళం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీపీ (మండల ప్రజా పరిషత్) అధ్యక్ష పదవుల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అఽథారిటీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆంధప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 సెక్షన్ 180 కల్పించిన అధికారాలతో పాటు, ప్రభుత్వం జారీ చేసిన జీవో 154 మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా ఈ రిజర్వేషన్లు కేటాయించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని మొత్తం 30 ఎంపీపీ, 30 జడ్పీటీసీ స్థానాలను ఎస్టీ, ఎస్సీ, బీసీ, అన్-రిజర్వ్డ్ (జనరల్), మహిళా కేటగిరీలకు కేటాయిస్తూ అధికారిక జాబితాను (అనెక్జర్-1) ప్రకటించారు. దీంతో స్థానిక పోరులో నిలబడే ఆశావహుల్లో ఉత్కంఠకు తెరపడినట్లయింది.
ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఇలా..
మెళియాపుట్టి మండలం (ఎస్టీ), జి.సిగడాం మండలం (ఎస్టీ జనరల్), కొత్తూరు, పాతపట్నం (ఎస్సీ మహిళ), పోలాకి, శ్రీకాకుళం, సంతబొమ్మాళి, పొందూరు, కోటబొమ్మాళి (బీసీ జనరల్), వజ్రపుకొత్తూరు, గార, నరసన్నపేట, సోంపేట, ఎచ్చెర్ల, కవిటి (బీసీ మహిళ), ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, ఇచ్ఛాపురం, ఎల్ఎన్పేట, లావేరు, రణస్థలం, సరబుజ్జిలి స్థానాలు (అన్-రిజర్వ్డ్ జనరల్), జలుమూరు, కంచిలి, మందస, నందిగాం, పలాస, సారవకోట, టెక్కలి మండలాలకు(అన్-రిజర్వ్డ్ మహిళ) రిజరేషన్లు కేటాయించారు.
జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు..
పాతపట్నం మండలం (ఎస్టీ), టెక్కలి (జనరల్), బూర్జ, లావేరు (ఎస్సీ మహిళ), జలుమూరు, కంచిలి, నందిగాం, పలాస, సారవకోట (బీసీ జనరల్), ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎల్ఎన్పేట, మందస, రణస్థలం, సరుబుజ్జిలి (బీసీ మహిళ), ఎచ్చెర్ల, జి.సిగడాం, గార, కవిటి, కోటబొమ్మాళి, నరసన్నపేట, సోంపేట, వజ్రపుకొత్తూరు (అన్-రిజర్వ్డ్ జనరల్), హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, పోలాకి, పొందూరు, సంతబొమ్మాళి, శ్రీకాకుళం (అన్-రిజర్వ్డ్ మహిళ) రిజరేషన్లు కేటాయించారు.