‘నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు’
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:15 AM
అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆప లేరని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు అన్నారు.
అరసవిల్లి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆప లేరని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు అన్నారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలని ఢిల్లీలో పోరాటం చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం నగరంలో అంబేడ్కర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఢిల్లీని పోలీసురాజ్యంగా మార్చారని విమ ర్శించారు. కేంద్రం ఇప్పటికైనా మేలుకుని ఓటు చోరీకి పాల్పడిన సీఈసీని తప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు బి.కృష్ణమూర్తి, జి.సింహాచలం, పి.తేజే శ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.