సమస్యలు పరిష్కరించాలని 12న ఉద్యమం
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:33 PM
సమస్యలను పరిష్క రించాలని కోరుతూ జూలై 12న శ్రీకా కుళంలో తొలి ఉద్యమం చేప ట్టనున్నామని ఏపీజేఏసీ(అమరావతి), శ్రీకాకుళం చైర్మ న్ బీవీవీఎన్ రాజు తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా నగరంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో శుక్రవారం సంఘ సమావేశం నిర్వహించారు.
ఏపీజేఏసీ(అమరావతి) జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు
శ్రీకాకుళం అర్బన్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్క రించాలని కోరుతూ జూలై 12న శ్రీకా కుళంలో తొలి ఉద్యమం చేప ట్టనున్నామని ఏపీజేఏసీ(అమరావతి), శ్రీకాకుళం చైర్మ న్ బీవీవీఎన్ రాజు తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా నగరంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో శుక్రవారం సంఘ సమావేశం నిర్వహించారు. పెండింగ్ డీఏలను ప్రకటించడం, సరెండర్ లీవుల మంజూరు, నోషనల్ ఇంక్రిమెంట్లు, సీపీఎస్ రద్దు, మహిళా ఉద్యోగులకు రెండేళ్లు చైల్డ్‌కేర్ లీవ్, వారానికి ఐదు రోజుల పని తదితర సమస్యల సాధన కోసం ఈ ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నా రు. ఈ ఉద్యమానికి స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీఆర్ ఎస్‌ఏ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జీకే శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.