Share News

హక్కుల సాధనకు ఉద్యమమే మార్గం

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:20 PM

హక్కుల సాధనకు ఉద్యమమే మార్గమని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వేంకటే శ్వర్లు అన్నారు. నగరంలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌ లో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడారు.

హక్కుల సాధనకు ఉద్యమమే మార్గం
మాట్లాడుతున్న ఏపీజేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వేంకటేశ్వర్లు

పీఆర్సీ కమిషనర్‌ను తక్షణం నియమించాలి

ఉద్యమ సభను విజయవంతం చేయండి

ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వేంకటేశ్వర్లు

అరసవల్లి, జూలై 9(ఆంధ్రజ్యోతి): హక్కుల సాధనకు ఉద్యమమే మార్గమని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వేంకటే శ్వర్లు అన్నారు. నగరంలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌ లో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడారు. బొప్ప రాజు మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషనర్‌ను వెంటనే నియమించాలని, మధ్యంతర భృతిని ప్రకటిం చాలని డిమాండ్‌ చేశారు. గత ఆరేళ్ల డీఏ బకా యిలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధా నాన్ని పునరుద్ధరించాలని, పేస్లిప్‌లో పెండింగ్‌ బకాయిలను పొందుపరచాలని డిమాండ్‌ చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీలో విద్యుత్తు బస్సులను ప్రభు త్వమే నిర్వహించాలని, 2010 ముందు నియ మితులైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయా లని కోరారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, గ్రూప్‌-4 నియామ కాలను వెంటనే చేపట్టాలని కోరారు. గ్రామ సహాయకులకు గౌరవ వేతనం రూ.21,500లు ఇవ్వాలని, మున్సిపల్‌ ఉద్యోగులకు సర్వీస్‌ రూల్స్‌ తక్షణమే రూపొందించాలని అన్నారు. ఈ సంద ర్భంగా సిక్కోలు గర్జన పోస్టర్‌ను ఆవిష్కరించా రు. సమా వేశంలో అసోసియేట్‌ చైర్మన్‌ ఫణి పేర్రాజు, ఏపీఆర్‌జేసీ జనరల్‌ సెక్రటరీ ఎస్‌వీ రమణ, మహిళా విభాగం చైర్‌పర్సన్‌ ప్రవల్లిక ప్రియ, కార్యదర్శి అరుణకుమారి, శ్రీనివాసరావు, సోనీ కిరణ్‌, గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 11:20 PM