Share News

ప్రభుత్వ భూములు అప్పగిస్తే ఉద్యమం

ABN , Publish Date - May 28 , 2026 | 11:25 PM

పారిశ్రామికీకరణపేరుతో ప్రభుత్వ భూములను బడాబాబులకు అప్పగిస్తే ప్రజాఉద్యమం తప్పదని మహాత్మజ్యోతీరావుపూలే రాష్ట్ర బీసీ సంఘం హెచ్చరించింది గురువారం సోం పేటలో సంఘ ప్రతినిధులు బీన ఢిల్లీరావు, కప్ప గోపీనాథ్‌, తోట యుగంధర్‌, తామాడ అప్పలస్వామి, చిరంజీవి, బొమ్మిడి జోగారావు, దాట్ల జనార్దన విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వ భూములు అప్పగిస్తే ఉద్యమం
మాట్లాడుతున్న జ్యోతీరావు పూలే బీసీ సంఘ ప్రతినిధులు

సోంపేట, మే 28(ఆంధ్రజ్యోతి) : పారిశ్రామికీకరణపేరుతో ప్రభుత్వ భూములను బడాబాబులకు అప్పగిస్తే ప్రజాఉద్యమం తప్పదని మహాత్మజ్యోతీరావుపూలే రాష్ట్ర బీసీ సంఘం హెచ్చరించింది గురువారం సోం పేటలో సంఘ ప్రతినిధులు బీన ఢిల్లీరావు, కప్ప గోపీనాథ్‌, తోట యుగంధర్‌, తామాడ అప్పలస్వామి, చిరంజీవి, బొమ్మిడి జోగారావు, దాట్ల జనార్దన విలేకరులతో మాట్లాడారు. కవిటి మండలంలోని శిలగాం వద్ద ప్రభుత్వ ఆదీనంలో ఉన్న 21 ఎకరాల భూమిని పారిశ్రామికీకరణ పేరుతో ఓ బడావ్యక్తికి కట్టబెడితే ఇక్కడి వారు ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే కిడ్నీవ్యాధితో ఇబ్బందిపడుతుంటే కాలుష్యం పెంచే కర్మాగారాలు ఏర్పాటుచేసి సమస్యలతో సతమతమవుతున్న ఉద్దానం ప్రాంతాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని కోరారు. కొబ్బరికి పెట్టింది పేరైన ఉద్దానంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని కోరారు. అలాకాకుండా కొట్లాది రూపాయల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - May 28 , 2026 | 11:25 PM