ఆశ్రమ పాఠశాలలు మూసివేస్తే ఉద్యమం
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:36 PM
రేషనలై జేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠ శాలలను మూసివేస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని ఆదివాసీ సంక్షే మ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి హెచ్చరించారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి
అరసవల్లి/శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): రేషనలై జేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠ శాలలను మూసివేస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని ఆదివాసీ సంక్షే మ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి హెచ్చరించారు. నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన భవన్‌లో శుక్ర వారం రౌండ్‌టేబుల్ సమా వేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది జారీ చేసిన రేషనలైజేషన్ మెమోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు విద్యకు దూర మయ్యే ప్రమాదం ఉందన్నారు. అలాగే సీఆర్టీ ఉద్యోగాలు పోతాయని, ఆదివాసీ యువత ఉపాధికి దూర మవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్, ఏపీటీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల శేషగిరి, వివిధ సంఘాల నేతలు సన్నశెట్టి రాజశేఖర్, కోత ధర్మారావు, వంకల మాధవరావు, డి.గణేష్, మిస్కా కృష్ణయ్య, యడ్ల సూర్యనారాయణ పాల్గొన్నారు.