వత్సవలసకు తరలివచ్చిన భక్తులు
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:09 AM
వత్సవలస రాజరాజే శ్వరి (రాజమ్మ) సంబరాలకు జిల్లాతో పా టు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
గార, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): వత్సవలస రాజరాజే శ్వరి (రాజమ్మ) సంబరాలకు జిల్లాతో పా టు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం సాయంత్రానికి గ్రామానికి వచ్చిన భక్తులు ఆది వారం తెల్లవారుజామున సమీపంలో ఉన్న సముద్ర తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు. అక్కడే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధువులతో ఆరగించి తిరిగి ఇళ్లకు బయలుదేరారు. సముద్ర స్నానాల సమయంలో ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా మెరైన్, గార పోలీసులు చర్యలు తీసుకున్నారు. భక్తులను అప్రమత్తం చేస్తూ మైక్‌లో హెచ్చరికలు జారీ చేశారు. సీఐలు పైడపు నాయుడు, బి.ప్రసాదరావు, ఎస్‌ఐలు సీహెచ్ గంగరాజు, హరికృష్ణ, ఏఎస్‌ఐ టి.చంద్ర మోహన్ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.