Share News

సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:55 PM

విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని పీఎంశ్రీ కార్యక్రమం జాయింట్‌ సెక్రటరీ ఆశిష్‌ కుమార్‌ గుప్తా అన్నారు.

సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి
ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న పీఎంశ్రీ జాయింట్‌ సెక్రటరీ ఆశిష్‌కుమర్‌ గుప్తా

పీఎంశ్రీ జాయింట్‌ సెక్రటరీ ఆశిష్‌కుమార్‌

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని పీఎంశ్రీ కార్యక్రమం జాయింట్‌ సెక్రటరీ ఆశిష్‌ కుమార్‌ గుప్తా అన్నారు. ఎచ్చెర్ల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలిక గురుకుల పాఠశాల/ కళాశా లను మంగళవారం సందర్శించారు. పీఎంశ్రీ అమలును పరిశీలించారు. తరగతి గదుల్లో ఐఎఫ్‌బీ ప్యానల్స్‌, ముస్తాబు కార్యక్రమం, ల్యాబ్స్‌, లైబ్రరీ, కిచెన్‌ గార్డెన్‌, ర్యాంపులను చూశారు. విద్యార్థినులు రూపొందించిన నమూనాలను పరిశీలించారు. పీఎంశ్రీ అమలు, ఫొటో, పీపీటీ ప్రదర్శన ద్వారా పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.పద్మజ వివరించారు. స్కౌట్‌, గైడ్స్‌ ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో డీఈవో రవిబాబు, డీసీవో వై.యశోదలక్ష్మి, ఎంఈవోలు కె.పున్నయ్య, జి.రాజ్‌కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:57 PM