కుమారుడికి తల్లి అంత్యక్రియలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:48 PM
అనారోగ్యంతో మృతి చెందిన కుమా రుడికి తల్లే అంత్యక్రియలు చేసిన హృదయ విదారక ఘటన రూర ల్ మండలం సానివాడలో బుధవారం సంభవించింది.
శ్రీకాకుళం రూరల్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మృతి చెందిన కుమా రుడికి తల్లే అంత్యక్రి యలు చేసిన హృదయ విదారక ఘటన రూర ల్ మండలం సానివాడలో బుధవారం సంభవించింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చెల్లిబోయిన అప్పారావు, రాజేశ్వరి దంప తుల పెద్ద కుమారుడు రాజు (40) అనారోగ్యంతో జీజీ హెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మృతి చెందాడు. ఇదే కుటుంబంలో కొద్ది నెలల కిందట రెండో కుమారుడు అనారోగ్యంతో కన్నుమూయగా, అప్పట్లో తండ్రి అంత్యక్రియలు చేశారు. తాజాగా పెద్ద కుమారుడు కూడా మృతి చెందడంతో బుధవారం తల్లి రాజేశ్వరి కుమా రుడి అంత్య క్రియలను నిర్వహించారు. వరుసగా ఇద్దరు కుమారులను కోల్పోయిన ఆ తల్లి దుఃఖం స్థానికులను కంటతడి పెట్టించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.