Share News

శ్రీకూర్మనాథుని దర్శించుకున్న మాత సుమనపురి

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:48 PM

ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మ నాథస్వామిని రాష్ర్టీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సంచా లకురాలు మాత సుమనపురి (మధ్యప్రదేశ్‌) శనివారం దర్శించుకున్నారు.

శ్రీకూర్మనాథుని దర్శించుకున్న మాత సుమనపురి
సుమనపురికి జ్ఞాపిక అందిస్తున్న అర్చకులు

గార, ఏప్రిల్‌ 11 (ఆంధ్ర జ్యోతి): ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మ నాథస్వామిని రాష్ర్టీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సంచా లకురాలు మాత సుమనపురి (మధ్యప్రదేశ్‌) శనివారం దర్శించుకున్నారు. ఆల య అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. స్వామి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం సుమన పురి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని కాపాడాలన్న సంకల్పంతో దేశ సమైక్యతను పరిరక్షించేందుకు ద్వాదశ జ్యోతిర్లింగాల పాదయాత్ర చేపడుతున్నామన్నారు. ఇప్పటికీ రెండే ళ్లు పాద యాత్ర పూర్తి చేసుకున్నామని, మరో రెండేళ్ల పాటు ఈ పాద యాత్ర సాగి రామేశ్వరంలో ముగిస్తామన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా ఉపా ధ్యక్షుడు శ్రీరంగం మధుసూదనరావు, సంస్థ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు గొద్దు భాస్కరరావు, కోశాధికారి టంకాల సూరప్పడు, ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తారక్‌ తరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:48 PM