Share News

కొడుకు చితికి తల్లి తలకొరివి

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:58 PM

కన్న కొడుకుకి తల్లి తలకొరివి పెట్టిన ఘటన సోమవారం తోటవూరులో చోటుచేసుకుంది. గ్రామస్థులు, బంధువుల కథనం మేరకు.. తెలంగాణలోని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో భరత్‌ మృతిచెందాడు.

కొడుకు చితికి తల్లి తలకొరివి
తలకొరివి పెడుతున్న తల్లి లీలావతి

సోంపేట రూరల్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): కన్న కొడుకుకి తల్లి తలకొరివి పెట్టిన ఘటన సోమవారం తోటవూరులో చోటుచేసుకుంది. గ్రామస్థులు, బంధువుల కథనం మేరకు.. తెలంగాణలోని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో భరత్‌ మృతిచెందాడు. మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరింది. దీంతో గ్రామస్థుల్లో విషాదచాయలు అలముకున్నాయి. రెండు నెలల కిందట భర్త భిలాయ్‌ లో మృతి చెందగా.. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు చిన్న వయసులోనే మృతి చెందడంతో తల్లి రోదిస్తోంది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో తల్లి లీలావతి తలకొరివి పెట్టింది.

Updated Date - Jun 22 , 2026 | 11:58 PM