నైతిక విలువలే పిల్లల భవితకు పునాది
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:52 PM
విద్యా ర్థి దశ నుంచి నైతిక విలువ లు పెంపొం దించడం ద్వారా వారి భవిష్యత్ కు మంచి పునాది వేయవచ్చని, ఈ దిశగా ఉపాధ్యాయులు పాటుపడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థి దశ నుంచి నైతిక విలువ లు పెంపొం దించడం ద్వారా వారి భవిష్యత్ కు మంచి పునాది వేయవచ్చని, ఈ దిశగా ఉపాధ్యాయులు పాటుపడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు. ఈ మేరకు సోమవారం న్యాయ సేవా సదన్‌లో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక న్యాయ అవగా హన సదస్సు నిర్వహించారు. పిల్లలు మొబైళ్లకు బానిసలుగా మారుతు న్నారని, ఇది వారి చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పోక్సో చట్టం, లైంగిక వేధింపుల చట్టాలపై ఉపాధ్యాయులు పూర్తి అవగాహన కలిగి ఉండా లన్నారు. డీఈవో రవిబాబు, జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్ పాల్గొన్నారు.