ఉత్సాహంగా ఏకపాత్రాభినయం పోటీలు
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:54 PM
శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరం లో శనివారం పురుషోత్తం సూర్యనారా యణ మాస్టారు స్మారక రాష్ట్రస్థాయి ఏక పాత్రాభి నయం పోటీలు నిర్వహించారు.
రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతి ప్రదానం
శ్రీకాకుళం కల్చరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరం లో శనివారం పురుషోత్తం సూర్యనారా యణ మాస్టారు స్మారక రాష్ట్రస్థాయి ఏక పాత్రాభి నయం పోటీలు నిర్వహించారు. జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 38 మంది కళాకారులు పా ల్గొని ఏకపాత్రాభినయంలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో నల్లపాటి అన్నపూర్ణ (చంద్రమతి ఏకపాత్ర) ప్రథమ, పుట్టా కృష్ణ (నక్షత్రకుడు) ద్వితీయ, కాతా హరిబాబు (హరి శ్చంద్ర) తృతీయ బహుమతులు సాధించారు. కన్సోలేషన్ బహుమతులను వైశ్యరాజు వెంకట రాజుగుప్త, మండా రమేష్, బంకుపల్లి విద్యా సాగర్, తొత్తిడి వెంకటప్పారావు పొందారు. ప్రత్యేక బహుమతులను సహస్ర, మోహిత్, జాహ్నవి సాధించారు. విజేతలకు రంగస్థల నటుడు యడ్ల గోపాలరావు, సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి బహుమతులను అంద జేశారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.