Share News

అమ్మ చంపేసింది

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:27 AM

Mother attempts suicide after slitting her children's throats కన్నతల్లే కర్కశంగా మారింది. జన్మనిచ్చి.. అల్లారుముద్దుగా పెంచిన ఆ తల్లి.. ఇద్దరు చిన్నారుల గొంతుకోసి కిరాతకంగా హతమార్చింది. ఆపై తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం.. లోకం తెలియని ఇద్దరు చిన్నారులను బలిగొంది.

అమ్మ చంపేసింది
వరలక్ష్మీ సవతితల్లిని విచారిస్తున్న డీఎస్పీ వివేకానంద.. ఇన్‌సెట్‌లో భవానీ, చాందిని (ఫైల్‌)

  • బిడ్డల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం

  • క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి

  • కొన ఊపిరితో చికిత్స పొందుతున్న తల్లి

  • వెదుళ్లవలసలో హృదయ విదారక ఘటన

  • కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ

  • ఆమదాలవలస, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి):

  • కన్నతల్లే కర్కశంగా మారింది. జన్మనిచ్చి.. అల్లారుముద్దుగా పెంచిన ఆ తల్లి.. ఇద్దరు చిన్నారుల గొంతుకోసి కిరాతకంగా హతమార్చింది. ఆపై తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం.. లోకం తెలియని ఇద్దరు చిన్నారులను బలిగొంది. అత్యంత విషాద.. హృదయవిదారకరమైన ఈ ఘటన ఆమదావలస మండలం వెదుళ్లవలసలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు..

  • వెదుళ్లవలస గ్రామానికి చెందిన కూర్మాపు వరలక్ష్మి సోమవారం రాత్రి తన ఇద్దరు చిన్నారులు భవానీ (3 ఏళ్లు), చాందిని(4 నెలల) గొంతులను కోసి హతమార్చింది. ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి తల్లీపిల్లలు ఇంట్లో పడుకున్నారు. వరలక్ష్మి అత్త లక్ష్మి వరండాలో నిద్రించింది. మంగళవారం ఉదయం అత్త తలుపు తెరిచి చూడగా.. రక్తపుమడుగులో కోడలు, మనమరాళ్లు కనిపించారు. దీంతో ఆందోళన చెంది కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందారని గుర్తించారు. కొన ఊపిరితో ఉన్న వరలక్ష్మిని 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాగా.. అక్కడ ఆనవాళ్లు బట్టి.. పసికందులు అని కూడా చూడకుండా కన్నతల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడడం స్థానికులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.

  • మనస్పర్థలే కారణమా?

  • రణసలం మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మికి వెదుళ్లవలసకు చెందిన కూర్మాపు రమణతో 2020 ఆగస్టు 14న వివాహమైంది. తల్లిదండ్రులు లేని వరలక్ష్మికి ప్రస్తుతం సవతి తల్లి వెంకటలక్ష్మితోపాటు ముగ్గురు సోదరులు ఉన్నారు. వరలక్ష్మి భర్త రమణ.. ఉపాధి నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నల్గొండలో ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలు, అత్తతో కలిసి.. వరలక్ష్మి వెదుళ్లవలసలో నివసిస్తోంది. రమణ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి కొద్దిరోజులు ఉండి మళ్లీ వెళ్లేవాడు. కాగా.. భార్యభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

  • ఆమె వాంగ్మూలమే కీలకం

  • సంఘటనా స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, ఆమదాలవలస ఎస్‌ఐ సనపల బాలరాజు, పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై డీఎస్పీ విచారణ చేపట్టారు. వరలక్ష్మి తల్లి వెంకటలక్ష్మి, అత్త లక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో డీఎస్పీ మాట్లాడుతూ.. ‘సోమవారం రా త్రి తన సోదరులతో వరలక్ష్మి ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. అనంతరం ఇద్దరు బిడ్డలను బ్లేడుతో గొంతు కోసి.. ఆమె కూడా గొంతు కోసుకున్నట్టు తెలిసింది. స్థానిక సమాచారం మేరకు కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణం. ప్రస్తుతం రిమ్స్‌లో వరలక్ష్మి చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు గల కారణాలు ఆమె నుంచి కూడా సేకరించి.. పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తామ’ని తెలిపారు.

  • వరలక్ష్మి తల్లి శీల వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలంపైనే కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుందన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:27 AM