అమ్మా.. నేనుండలేను!
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:26 AM
తల్లి మరణంతో ఆ యువకుడు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. తనలో తానే కుమిలిపోయాడు.
తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య
సోంపేట రూరల్, జూలై 19(ఆంధ్రజ్యోతి): తల్లి మరణంతో ఆ యువకుడు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. తనలో తానే కుమిలిపోయాడు. చివరకు బలవనర్మణం చెందాడు. గ్రామస్థుల కథనం మేరకు.. బారువ కొత్తూరు గ్రామానికి చెం దిన వలిశెట్టి హనీష్‌కుమార్(19) విజయనగరంలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం తల్లి మంగమ్మ కొర్లాం వద్ద జరి గిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అప్పటి నుంచి తల్లి ధ్యాసలో ఉంటూ చదువుపై కూడా శ్రద్ధ చూపేవాడు కాదు. ఎప్పుడూ ముభావంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. తల్లిలేని జీవితం తనకెందుకం టూ తెలిసిన వారితో అంటూ ఉండేవాడు. తల్లి రోడ్డు ప్రమాదానికి గురైన ప్రదేశానికి కొద్ది దూరం లోనే బావరు, కొర్లాం మధ్య ఆదివారంఉదయం గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పలాస రైల్వే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరు కుని పరిశీలించారు. మృతుని తండ్రి జోగారావు విశ్రాంత బీఎస్‌ఎఫ్‌ఉద్యోగి. ఆరునెలల క్రితం భార్య మృతిచెందడం, ఇప్పుడు కుమారుడు ఆత్మ హత్యచేసుకోవడంతో ఆయన మానసికంగా కుంగి పోయారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.