మోదీ నిరంతర ప్రజాసేవకుడు
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:15 AM
25 ఏళ్లగా నిరంతర ప్రజా సేవకుడు నరేంద్రమోదీ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, సేవా జ్యోతి జిల్లా ఇన్‌చార్జి పెడ్డి పావని కొని యాడారు. బుధవారం శ్రీకాకుళంలో నరేంద్రమోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్‌లో సేవా జ్యోతి కాగాడను నాయకులు ఆవిష్కరించారు.
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): 25 ఏళ్లగా నిరంతర ప్రజా సేవకుడు నరేంద్రమోదీ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, సేవా జ్యోతి జిల్లా ఇన్‌చార్జి పెడ్డి పావని కొని యాడారు. బుధవారం శ్రీకాకుళంలో నరేంద్రమోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్‌లో సేవా జ్యోతి కాగాడను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్ నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రస్థానం కోసం ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, జిల్లా సేవా సంకల్ప్ అభియాన్ కన్వీనర్ చింతు పాపారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిర్లంగి ఉమామహే శ్వరరావు, పోకతోట సింహాచలం, సూరపునాయుడు పాల్గొన్నారు.