Share News

ఎర్ర చెరువును ఆధునికీకరిస్తా

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:08 AM

మేజర్‌ పంచాయతీ పాతపట్నంలోని ఎర్ర చెరువుకు ఆధునిక రూపాన్నిచ్చేందుకే చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

ఎర్ర చెరువును ఆధునికీకరిస్తా
పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం జనవరి 28(ఆంధ్రజ్యోతి): మేజర్‌ పంచాయతీ పాతపట్నంలోని ఎర్ర చెరువుకు ఆధునిక రూపాన్నిచ్చేందుకే చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు బుధవారం పాతపట్నంలోని ఎర్ర చెరువుపై జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎర్ర చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాగ్‌, పార్కు ఏర్పాటు చేయిస్తామన్నారు. దీంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన డంతో పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందన్నారు. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయిస్తున్నట్టు తెలిపారు. పీఆర్‌డీఈఈ ఎ.చంద్రినాయుడు, ట్రాన్స్‌కో ఏడీఈ ప్రసాదరావు, టీడీపీ నాయకులు పైల బాబ్జీ, పెద్దింటి శ్రీను, సిర్ల జోగారావు, కె.కర్రెన్న, కలమట భుజంగరావు తదితరులు ఉన్నారు. అలాగే తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి, అర్జీదారులను వినతులు స్వీకరించారు.

Updated Date - Jan 29 , 2026 | 12:08 AM