Share News

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే శంకర్‌ సాయం

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:48 PM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను తన సొంత వాహనంలో ఆసుపత్రికి తర లించి ఎమ్మెల్యే గొండు శంకర్‌ మానవత్వాన్ని చాటుకున్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే శంకర్‌ సాయం
క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను తన సొంత వాహనంలో ఆసుపత్రికి తర లించి ఎమ్మెల్యే గొండు శంకర్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని రామి గెడ్డ జంక్షన్‌ వద్ద శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని సాగర్‌, భాను తీవ్రంగా గాయపడ్డారు. అదే మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌ వెంటనే స్పందించి అంబులెన్స్‌ ఆలస్యమవుతుందని తెలిసి క్షతగాత్రులను తన సొంత వాహనంలో రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యు లను ఆదేశించారు. ఆపద సమయంలో మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్యేను స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు అభినందించారు.

Updated Date - Nov 28 , 2026 | 11:48 PM