స్త్రీశక్తి పథకంపై ఎమ్మెల్యే శంకర్ ఆరా
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:23 AM
స్వా తంత్య్ర దినోత్సవం సంద ర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ స్ర్తీ శక్తి బస్సులో ప్ర యాణించి మహిళా ప్రయా ణికులతో ముచ్చ టించారు.
శ్రీకాకుళం అర్బన్, ఆగ స్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వా తంత్య్ర దినోత్సవం సంద ర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ స్ర్తీ శక్తి బస్సులో ప్ర యాణించి మహిళా ప్రయా ణికులతో ముచ్చ టించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనతో మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణంతో నెలకు వందల రూపాయలు ఆదా అవుతున్నాయని తెలిపారు. మహిళా సాధికారితకు స్ర్తీశక్తి పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్‌లో ఏసీ, ఎలక్ర్టిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
మహిళలతో కలిసి ప్రయాణించిన ఎంపీ, ఎమ్మెల్యే
రణస్థలం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్త్రీశక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శనివారం రణస్థలం నుంచి బొంతుపేట వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. మహిళలు స్వశక్తి తో ఎదగాలని, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవానాన్ని సాగించాలని సూచించారు.