రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు
ABN , Publish Date - May 07 , 2026 | 12:25 AM
రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలతోనే రైతులకు పూర్తిస్దాయి హక్కులు కలుగుతాయని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు తెలిపారు.
పాసుపుస్తకాలతోనే రైతులకు హక్కులు
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
ఎల్‌ఎన్ పేట, మే 6(ఆంధ్రజ్యోతి): రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలతోనే రైతులకు పూర్తిస్దాయి హక్కులు కలుగుతాయని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు తెలిపారు. సిద్దాంతం గ్రామంలో బుధవారం రైతులకు రాజ ముద్రతోకూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం రైతుల హక్కులు హరించేలా పాసుపుస్తకాలపైనా, భూ హద్దుల కోసం వేసిన రాళ్లపైనా అప్పటి ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి బొమ్మలు వేయించిందని మండిపడ్డారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పాసుపుస్తకాలను రద్దు చేసి రాజముద్రతో కూడి పాసు పుస్తకాలను రైతులకు అందిస్తుందన్నారు. అనంతరం గ్రామంలోని రైతులకు నవధాన్యాల కిట్లును అందజేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుని భూసారాన్ని పెంపొందించుకోవాలని రైతులకు సూచిం చారు. అలాగే గడేవానిపేట(బరటాం) గ్రామంలో గౌరీసమేత నీలకంఠేశ్వర స్వామి విగ్రహప్రతిష్టోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ.25వేలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ, ఎంపీడీవో పి.శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి కిరణ్‌వాణి, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మోహనరావు, కె.చిరంజీవి, బీఆర్‌ఆర్ ప్రాజెక్టు జిల్లా వైస్‌చైర్మన్ వి.ఆనందరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.