పీహెచ్‌సీ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:20 AM
పాతర్లపల్లి పీ హెచ్‌సీ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అగ్రహం వ్యక్తం చేశారు.
రణస్థలం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పాతర్లపల్లి పీ హెచ్‌సీ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో మందులు, సిబ్బం ది హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సమయం లో కొంతమంది వైద్య సిబ్బంది విధులకు గైర్హాజర్ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుపేదల వైద్యం కోసం ప్రభు త్వం అనేవిధాలా చర్యలు తీసుకుంటుంటే క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపడడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిబ్బంది పనితీరుపై సంబంధిత అఽధికారులకు ఫిర్యాదు చేశారు.