‘ఆంధ్రజ్యోతి’ సబ్ ఎడిటర్‌కు ఎమ్మెల్యే పరామర్శ
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:44 AM
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘ఆంధ్ర జ్యోతి’ సబ్ ఎడిటర్ తాడి రాజేష్‌ను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం పరామర్శించారు.
శ్రీకాకుళం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘ఆంధ్ర జ్యోతి’ సబ్ ఎడిటర్ తాడి రాజేష్‌ను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం పరామర్శించారు. శ్రీకాకుళం యూనిట్ ఆఫీసులో విధులు ముగించుకుని వెళుతుండగా గత ఆదివారం అర్ధ రాత్రి ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట వద్ద కారు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలోని న్యూరో ఐసీయూలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను ఎమ్మెల్యే పరామర్శించి అతడి యోగక్షేమా లను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి రాజేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరింత మెరుగైన వైద్యం అం దించాలని సూ చించారు. రాజేష్ ఆసుపత్రిలో చేరినప్పుడే తాను మెడికవర్ యాజమాన్య ప్రతినిధి డాక్టర్ సాగరికతో మాట్లాడానని ఎమ్మెల్యే వెల్లడించారు. రాజేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుం బానికి అన్ని విధా లా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయ కులు అంధవరపు సంతోష్, కె.నాగార్జున ప్రతాప్ తదితరులున్నారు.