మిర్తిబట్టి ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం
ABN , Publish Date - May 26 , 2026 | 11:28 PM
నగరంలోని మిర్తిబట్టి ప్రాంతాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలిం చారు.
అరసవల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): నగరంలోని మిర్తిబట్టి ప్రాంతాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలిం చారు. సత్య నగర్, భార్గవ నగర్, భాస్కర్ నగర్, ఎస్‌బీఐ కాలనీ ప్రాంతాల్లో నడుచు కుంటూ వెళ్లి స్థానిక సమస్యలను తెలుసు కుంటూ పరిస్థితిని పరిశీలించారు. మిర్తిబట్టి ప్రారంభంలో 10 అడుగు లుండగా చివరికి వచ్చే సరికి నాలుగు అడు గులు ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆక్రమణలు జరుగు తుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నిం చారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, ప్రజలకు ఇబ్బందులు కలుగజేయడం సరికాదన్నారు. ప్రస్తుతం కాలువ చెత్తా చెదారంతో నిండిపోయి ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణలను గుర్తించి తగు చర్యలు తీసుకో వాలని, కాలువను శుభ్రం చేయాలని సంబంఽ దిత అధికారులకు ఫోన్‌లో ఆదేశించారు.