తప్పిపోయి...క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు..
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:01 AM
కొత్తమ్మతల్లి ఉత్సవాల సందర్భంగా అమ్మ వారిని దర్శిం చుకోవడానికి మంగ ళవారం వచ్చిన విజయనగరం జిల్లా మెట్టక్కివలస గ్రామా నికి చెందిన ఎం.కైనాద్ రంజన్ కుమారుడు ఢిల్లీ (4) రద్దీలో తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు చిరు వ్యాపారుల దగ్గర ఆట వస్తువులు కొనుగోలు చేస్తుండగా చిన్నారి రోడ్డుమీద నడుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.
కోటబొమ్మాళి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కొత్తమ్మతల్లి ఉత్సవాల సందర్భంగా అమ్మ వారిని దర్శిం చుకోవడానికి మంగ ళవారం వచ్చిన విజయనగరం జిల్లా మెట్టక్కివలస గ్రామా నికి చెందిన ఎం.కైనాద్ రంజన్ కుమారుడు ఢిల్లీ (4) రద్దీలో తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు చిరు వ్యాపారుల దగ్గర ఆట వస్తువులు కొనుగోలు చేస్తుండగా చిన్నారి రోడ్డుమీద నడుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. దీంతో పక్కన ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద కుటుంబ సభ్యులు సంప్రదించారు. వారు మైక్‌లో ప్రచారం చేసి.. బాబును పట్టుకొని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.