Share News

వైసీపీ ప్రభుత్వంలో రూ.వేల కోట్లు దుర్వినియోగం

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:22 AM

వైసీపీ ప్రభు త్వంలో అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి తన పిచ్చి చేష్టల తో పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని దానిని కరపత్రంగా తయారు చేసి రైతులను అవమాన పరిచారని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈ ఆర్‌) విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వంలో రూ.వేల కోట్లు దుర్వినియోగం
రైతులకు అందించే పట్టాదారు పాస్‌ పుస్తకాలను చూపుతున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

జి.సిగడాం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభు త్వంలో అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి తన పిచ్చి చేష్టల తో పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని దానిని కరపత్రంగా తయారు చేసి రైతులను అవమాన పరిచారని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈ ఆర్‌) విమర్శించారు. బుధవారం గేదెలపేటలో నూతన పట్టాదారు పాసుప్తుకాల పంపిణీ చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీ సర్వే పేరుతో రూ.వేల కోట్ల కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిం చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుతో ప్రజల అభద్రతను దూరం చేసింద న్నా రు. రైతులను గౌరవించేలా, భూ సమస్యలను పరి ష్కరించేలా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవి కుమార్‌, జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు బాల బొమ్మ వెంకటే శ్వరరావు, ఏఎంసీ ఉపాధ్యక్షుడు బూరాడ వెంకట రమణ, బీజేపీ, జనసేన మండల అధ్యక్షుడు పైల విష్ణుమూర్తి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పడాల అప్పన్న. పీఏసీ ఎస్‌ చైర్మన్‌ నక్క మురళీ, సర్పంచ్‌లు గేదెల మల్లిబాబు, సాకేటి నాగరాజు, బోగాది అప్పలనాయుడు, కామోజుల సీతారాం, తహసీల్దార్‌ ఎం.సరిత, ఎంపీడీవో జి.రామ కృష్ణారావు, ఏవో బెండి బాబ్జీ, ఎంఈవోలు ఆరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు, ఏపీవో సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:22 AM