భోజన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:09 AM
భోగాపురం లో అల్లూరు సీతారామరాజు అంతర్జా తీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యం లో శనివారం ప్రధాని మోదీ సభకు వెళ్లే ప్రజ లకు భోజనం అందించేందుకు ఎచ్చెర్ల నియో జకవర్గంలో చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పి.నారాయణ, గొట్టి పాటి రవి కుమార్, రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శుక్రవారం పరిశీలించారు.
లావేరు/రణస్థలం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భోగాపురం లో అల్లూరు సీతారామరాజు అంతర్జా తీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యం లో శనివారం ప్రధాని మోదీ సభకు వెళ్లే ప్రజ లకు భోజనం అందించేందుకు ఎచ్చెర్ల నియో జకవర్గంలో చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పి.నారాయణ, గొట్టి పాటి రవి కుమార్, రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. లావేరు మండలం తాళ్లవలస వేదమాత వెంచర్, బెజ్జి పురం వద్ద సిక్కోల్ హైల్యాండ్స్ వెంచర్లలో భోజ నాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మం త్రులు భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సభకు హాజర య్యే ప్రజలకు భోజనాలు అందించాలని మంత్రు లు సూచించారు. ఈ సందర్భంగా మంత్రులను టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత సత్కరిం చారు. కార్యక్రమంలో రాష్ట్ర పేరిక బలిజ కార్పొ రేషన్ చైర్మన్ భద్రయ్య, ఆర్డీవో సాయిప్రత్యేష, తహసీల్దార్ శీనివాసరావు, ఎంపీడీవో పి.వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు నివాసంలో ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ ఏర్పాటు చేసిన అతిథ్యాన్ని మంత్రులు స్వీకరించారు.