‘గుండ’ కుటుంబానికి మంత్రి సంధ్యారాణి పరామర్శ
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:05 AM
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పలసూర్య నారాయణ మృతి చెందిన విష యం తెలుసుకుని సోమవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ఆయన కుటుంబ సభ్యులను పరా మర్శించారు.
శ్రీకాకుళం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పలసూర్య నారాయణ మృతి చెందిన విష యం తెలుసుకుని సోమవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ఆయన కుటుంబ సభ్యులను పరా మర్శించారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కుమారులతో మాట్లాడి ఓదార్చారు. దశాబ్దాల తరబడి టీడీపీకి, జిల్లా అభివృద్ధికి అప్పల సూర్య నారాయణ అందించిన సేవలు ఎనలేనివని సం ధ్యారాణి అన్నారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. పాలకొండ ఎమ్మె ల్యే నిమ్మక జయకృష్ణ సంతాపం తెలిపారు.
నిబద్ధత కలిగిన నేత ‘గుండ’
ఆమదాలవలస, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నేత అని టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విద్యా సాగర్ అన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీత తదితరులు సోమవారం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని పరామర్శించారు. పరామర్శించిన వారిలో టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు బోయిన సునీత, మాజీ కౌన్సిలర్ రెడ్డి గౌరి, కింజరాపు సుప్రియ ఉన్నారు.