కార్యకర్తల పక్షపాతి మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:57 AM
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువ నేత, మంత్రి నారా లోకేష్ నియామకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కోటబొమ్మాళి మండలం రామయ్య పేటలో బుధవారం పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.
మంత్రి అచ్చెన్నాయుడు
కేక్ కట్ చేసి సంబరాలు
శ్రీకాకుళం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువ నేత, మంత్రి నారా లోకేష్ నియామకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కోటబొమ్మాళి మండలం రామయ్య పేటలో బుధవారం పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యాలను పుణికిపుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ ఎదిగారని కొనియా డారు. విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచడం, డిజిటల్ విద్య ను ప్రోత్సహించడం, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడంలో ఆయన తీసుకు వస్తున్న మార్పులు ప్రశంసనీయమన్నారు. లోకేష్ సారథ్యంలో రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గత ఐదేళ్ల ప్రతి కూల పరిస్థి తుల్లో ‘యువగళం’ పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఆయన చైతన్యం తెచ్చారని గుర్తుచేశారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి, బీమా సదుపాయం కల్పించడంతో పాటు, సాధారణ కార్యకర్తలకు సైతం పార్టీలో ఉన్నత పదవులు దక్కేలా చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకేష్ సారథ్యంలో సరికొత్త లక్ష్యాలు
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ, రాష్ట్ర పార్టీ కమిటీ ల కూర్పును ఆయన స్వాగతిస్తూ.. ఎంపికైన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను, చంద్ర బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లోకేష్ నాయక త్వంలో పార్టీ జాతీయ స్థాయిలో మరింత బలోపేతమవుతుందన్నారు. తనకు మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులు సరికొత్త లక్ష్యాల తో మరింత ఉత్సాహంగా పని చేయాలని రామ్మోహన్ నాయుడు పిలుపు నిచ్చారు. భవిష్యత్‌లో పసుపుదళం దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.