నెరవేరిన మంత్రి లోకేశ్ హామీ
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:55 PM
New look for Municipal Primary School in Etcherlaveedhi శ్రీకాకుళంలోని ఎచ్చెర్లవీధిలో నగరపాలక ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర విద్యాశాఖ, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ నెరవేరింది. శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని తొలగించి దాని స్థానంలో సర్వాంగసుందరంగా సరికొత్త భవ నాన్ని నిర్మించారు.
ఎచ్చెర్లవీధిలో నగరపాలక ప్రాథమిక పాఠశాలకు కొత్తశోభ
శ్రీకాకుళం, జూన్ 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఎచ్చెర్లవీధిలో నగరపాలక ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర విద్యాశాఖ, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ నెరవేరింది. శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని తొలగించి దాని స్థానంలో సర్వాంగసుందరంగా సరికొత్త భవ నాన్ని నిర్మించారు. గతంలో శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ ఎచ్చెర్లవీధిలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్.. మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కొత్త భవనం నిర్మిస్తామని లోకేశ్ హామీనిచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేసి.. నిర్మాణ పనులు పూర్తికావడంతో.. పాఠశాల భవనం ప్రారంభో త్సవానికి ముస్తాబైంది. ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు మంత్రి లోకేశ్‌కు ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల భవనం ఫొటోలతోపాటు.. ‘థ్యాంక్యూ అన్నగారూ’ అంటూ కృతజ్ఞతా సందేశాన్ని మంత్రి లోకేశ్‌కు పంపిం చారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పేద విద్యార్థుల భవిష్యత్‌పై విద్యాశాఖ మంత్రి లోకేశ్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు.