Share News

ఆహారంలో చిరుధాన్యాలను వినియోగించాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:36 PM

చిరుధాన్యాల వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఇదే ఉద్దేశంతో పూర్వీకులు వీటిని తినేవారని, అందువల్ల మన ఆహారాల్లో వీటి వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతై నా ఉందని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డా.జి.సౌమిని అన్నారు.

 ఆహారంలో చిరుధాన్యాలను వినియోగించాలి
మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ డా.జి.సౌమిని

రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డా.సౌమిని

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): చిరుధాన్యాల వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఇదే ఉద్దేశంతో పూర్వీకులు వీటిని తినేవారని, అందువల్ల మన ఆహారాల్లో వీటి వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతై నా ఉందని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డా.జి.సౌమిని అన్నారు. బ్రిక్స్‌ సస్టైన బుల్‌ లైప్‌స్టైల్‌ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రిమ్స్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆహార భద్రత, పోష కాహారంపై భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందన్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, సాములు వంటి చిరుధాన్యాల్లో కాల్షి యం, ఐరన్‌, ఫైబర్‌ వంటి మైక్రో న్యూట్రియంట్స్‌ సమృద్ధిగా ఉంటా యన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత, గుండెజబ్బుల నివా రణకు ఎంతో మేలుచేస్తాయన్నారు. వీటితో పాటు నువ్వులు, గుమ్మడి, అవిసె గింజలను తీసుకోవడం వల్ల ఓమేగా-3, రోగ నిరోధకశక్తి పెరుగు తుందన్నారు. వీటిపై రోగులు, వారి సహాయకులకు అవగాహన కలిగిం చాలన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ ఆర్‌ఎంవో డా.గోపాలకృష్ణ, సంధ్యారాణి, డైటీషియన్‌ శివప్రసాద్‌, ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:36 PM