అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:48 AM
కొయ్యరాళ్లు జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరా త్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయ పడ్డారు.
అతివేగంతో ఢీకొన్న వాహనం
ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్లకు గాయాలు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): కొయ్యరాళ్లు జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరా త్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయ పడ్డారు. ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎచ్చెర్ల ఆంధ్రజ్యో తి కార్యాలయంలో సబ్ ఎడిటర్లుగా పనిచేస్తున్న పైల మదన్‌మోహన్, తాడి రా జేష్ రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై శ్రీకాకుళం వైపు సర్వీసు రోడ్డులో వె ళ్తుండగా, హైవే పై నుంచి సర్వీస్ రోడ్డులోకి అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మదన్‌మోహన్ బైక్ నడుపుతుం డగా, వెనుక రాజేష్ కూర్చొన్నారు. విశాఖపట్నం వైపు నుంచి కారు అతివేగంగా వచ్చి జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి, సర్వీసు రోడ్డులో వెళ్తున్న వీరి బైక్‌ను ఢీకొట్టింది. గాయపడిన వీరిద్దరూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజేష్ తీవ్రంగా గాయపడగా, మదన్‌మోహన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మదన్‌మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 125-బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.